పరాజయంలో ఓదార్పే ఊపిరి, ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శనీయం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Consolation is a Great Sigh of Relief in Defeat PM Modi is Exemplary in It JanaSena Chief Pawan Kalyan, JanaSena Chief Pawan Kalyan Says Consolation is a Great Sigh of Relief in Defeat PM Modi is Exemplary in It, Consolation is a Great Sigh of Relief in Defeat PM Modi is Exemplary in It, Consolation is a Great Sigh of Relief in Defeat, PM Modi is Exemplary in Consolation is a Great Sigh of Relief in Defeat, Modi is Exemplary in Consolation is a Great Sigh of Relief in Defeat, PM Modi is Exemplary in It, JanaSena Chief Pawan Kalyan, JanaSena President Pawan Kalyan, Pawan Kalyan, PM Modi News, PM Modi Latest News, PM Modi Latest Updates, PM Modi Live Updates, Mango News, Mango News Telugu,

పరాజయంలో ఓదార్పే ఊపిరి అని, ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం వరుస ట్వీట్స్ చేశారు. “విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారు. అదే అపజయం వెంటాడినపుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. నిజానికి సత్ఫలితాలు వచ్చినప్పుడు చేసే సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉన్న వారే గొప్పగా కనపడతారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తేవడానికో, దేశానికి విజయాలు సాధించిపెట్టడానికో పరితపిస్తూ, పరిశ్రమిస్తూ త్రుటిలో విజయానికి దూరమైన వారికి భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుంది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడా పోటీలలో మహిళా కుస్తీ పోటీలో బంగారు పతకం చేజారిపోయి, కాంస్యం మాత్రమే దక్కించుకున్న పూజ గెహ్లాట్ దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలని విలపిస్తున్న వీడియోను మోదీ చూసి ఆమెను ఓదార్చిన తీరు మానవీయంగా ఉంది. నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చింది..క్షమాపణలు కాదు. నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాము…నీ విజయం మాకో అద్భుతం అని ఆమెకు పంపిన సందేశం కదిలించేలా ఉంది. ఈ సందర్భంలోనే కాదు, పలు సంఘటనలలో ఆయన చూపిన ఇటువంటి ఓదార్పు మనసుకు స్వాంతన చేకూరుస్తాయి. టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో మన దేశ హాకీ మహిళ టీం ఫైనల్ చేరుకోవడంలో విఫలమైనప్పుడు మన క్రీడాకారిణులు మైదానంలో విలపించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ సందర్భంలో కూడా ప్రధాని మోదీ మన క్రీడాకారిణులను ఇలాగే ఓదార్చారు. వారికి ఫోన్ చేసి తండ్రిలా అనునయించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలమైన సందర్భాల్లోనూ ప్రధాని మోదీ మన శాస్త్రవేత్తలకు గుండెధైర్యాన్ని నింపారు. ఈ ప్రాజెక్టులోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడంలో విఫలమైనప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా మన శాస్త్రవేత్తలను గేలి చేశారు, అవమానించారు. అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చీఫ్ శివన్ ను గుండెలకు హత్తుకుని పరాజయాన్ని మరిచిపోండి. భవిష్యత్తుపై దృష్టిపెట్టండని చెప్పి శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కుడా మనం మరిచిపోలేని సంఘటన. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటున్నాను. పూజ గెహ్లాట్ తో పాటు కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =