సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్

AP CM YS Jagan Pays Tribute To Superstar Krishna at Padmalaya Studio Hyderabad Today,AP CM Paid Tribute To Superstar Krishna,Superstar Ghattamaneni Krishna Death,Superstar Krishna Passes Away,Tollywood Senior Actor Krishna,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం జగన్ నేరుగా ప‌ద్మాల‌యా స్టూడియోకి చేరుకొన్నారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం ఉంచిన కృష్ణ భౌతికకాయం వద్ద పువ్వులు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పలకరించి ధైర్యం చెప్పారు. అలాగే కృష్ణ వారసుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబును ఆలింగనం చేసుకొని ఓదార్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇక సీఎం జగన్ వెంట మంత్రి వేణుగోపాలకృష్ణ మరియు పలువురు అధికారులు ఉన్నారు.

కాగా సీఎం జగన్ రాకకు కొద్దిసేపు ముందు నందమూరి బాలకృష్ణ, తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మహేష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఈరోజు కృష్ణకు నివాళులు అర్పించడానికి సినీ పరిశ్రమ నుంచి నిర్మాతలు దిల్ రాజు, కేఎల్ నారాయణ, రామసత్యనారాయణ, డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, మెహర్ రమేష్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నటుడు కోట శ్రీనివాసరావు తదితరులు పద్మాలయా స్టూడియోకు చేరుకున్నారు. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని ఇక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్ర మొదలుపెట్టి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా ప్రస్తుతం ప‌ద్మాల‌యా స్టూడియోలో అభిమానులు, సామాన్య ప్రజలు కడసారి కృష్ణ పార్థివదేహాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + nineteen =