అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన, 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిర్ణయం

Former US President Donald Trump Announces Bid For 2024 US President Election,Former US President Donald Trump,2024 US President Election,US President Election 2024,US President Election,Mango News,Mango News Telugu,Trump Announces Bid For 2024 Election,USA 2024 Election,US 2024 Election,US Election,Donald Trump,Donald Trump US Election,Donald Trump USA Election,USA Election,Trump Latest News And Updates

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో ఉంటానని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. మంగళవారం మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో ఫ్లోరిడాలోని తన రాజభవనమైన మార్-ఎ-లాగో నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, “అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి, ఈ రాత్రి యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను. అమెరికా పునరాగమనం ఇప్పుడే ప్రారంభమవుతుంది” అని పేర్కొన్నారు. ముందుగా ట్రంప్ మద్దతుదారులు యూఎస్ ఫెడరల్ ఎలక్షన్ కమీషన్‌ వద్ద పత్రాలను దాఖలు చేశారు. నిధుల సేకరణ, ప్రచార నేపథ్యంలో డోనాల్డ్ జే.ట్రంప్ ఫర్ ప్రెసిడెంట్ 2024 అనే కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మరోవైపు 2024 అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిని అధికారికంగా ఎంపిక చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, వర్జీనియా గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్, టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ మరియు మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో కూడా పోటీలో ఉంచొచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో తాను బరిలో ఉండనున్నట్టు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందుగానే ప్రకటించడం విశేషం. అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఆశించినన్ని సీట్లు రాకపోయినా ట్రంప్ అధ్యక్ష బరిలో ఉండేందుకే నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మూడోసారి అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్‌ బిడ్‌ దాఖలు చేశారు. కాగా డెమొక్రాటిక్ తరపున ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మళ్ళీ 2024లో కూడా పోటీ చేయనున్నారా లేదా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + four =