కర్నూలు జిల్లా దేవరగట్టులో ముగిసిన బన్నీ ఉత్సవాలు, కర్రల సమరంలో 50 మందికి పైగా గాయాలు

AP Dozens of People Injured in Bunni Utsavam During Dussehra Festival at Devaragattu Kurnool, Kurnool Devaragattu, Devaragattu Dussehra Festival, Bunni Utsavam, People Injured in Bunni Utsavam, AP Dozens of People Injured in Bunni Utsavam, Mango News, Mango News Telugu, Dussehra Festival Celebrtions, Dussehra Festival News And Live Updates, Dussehra Celebrtions, Kurnool Bunni Utsavam, Bunni Utsavam Latest News And Updates

కర్నూలు జిల్లా హొళగొండ మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా కర్రల సమరం జరగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాల (మాల మల్లేశ్వర స్వామి విగ్రహాలు)ను దక్కించుకునే క్రమంలో దాదాపు 10 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో సమరం చేసుకుంటారు. ఈ ఉత్సవంలో అనేకమంది గాయాలు పాలవుతుంటారు. ఇది కొన్ని శతాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి నిర్వహించిన ఈ బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తం చిందింది. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్దఎత్తున గుమికూడిన ప్రజలు కర్రలతో ఒకరినొకరు ఎదుర్కొనే క్రమంలో 50 మందికి పైగా గాయపడ్డారు.

గాయపడ్డ వారిలో పలువురికి తలలు పగలగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి స్థానిక దేవరగట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన వీరారెడ్డి (17) అనే యువకుడు మృతి చెందాడు. కాగా ఈ యువకుడు గుండె పోటుతో మృతి చెందాడని నిర్ధారించిన పోలీసులు అతడిని ఆదోని మండలం ఎడ్డవల్లి గ్రామ వాసిగా గుర్తించారు. ఇక ఈ ఉత్సవాన్ని చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు దేవరగట్టు గ్రామానికి వస్తారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించినట్లు అంచనా వేస్తున్నారు.

కాగా ఇక్కడి ప్రజల నమ్మకం ప్రకారం.. పూర్వం మణి మరియు మల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులను చంపడానికి శివుడు భైరవ రూపాన్ని తీసుకున్నాడు. శివుడు ఇద్దరు రాక్షసులను కర్రలతో పోరాడి చంపాడు. దీంతో కర్రలతో పోరాడడం, గాయపడడం, రక్తం చిందించడాన్ని ప్రజలు మంచి శకునంగా భావిస్తారు. ఈ నమ్మకానికి అనుగుణంగా నేరడికి, నేరానికి తండా మరియు కొత్తపేట గ్రామస్థులు భగవంతుని అనుచరులుగా భావిస్తారు. అలాగే మరోవైపు ఎల్లార్తి, అరికర, మద్దిగేరి, నిత్రనట్ట, సులవాయి, హెబ్బెటం వాసులు దెయ్యాల అనుచరులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేవరగట్టు నుంచి మాల మల్లేశ్వర స్వామి విగ్రహాలను తమ గ్రామాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కర్రలతో ఒకరినొకరు అడ్డుకునే ప్రయత్నంలో సమరం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =