మరి ఆలపాటి రూటెటు?

Politics,Alapati Rajendra Prasad,Tenali ,Galla Jayadev, Chandrababu, Guntur MP Ticket, Nadendla Manohar ,Gorantla Buchaiah Chowdary, Janasena Pawan Kalyan,Andhra Pradesh News Updates, AP Political News,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Politics,Alapati Rajendra Prasad,Tenali ,Galla Jayadev, Chandrababu, Guntur MP Ticket, Nadendla Manohar ,Gorantla Buchaiah Chowdary, Janasena Pawan Kalyan,

టీడీపీ,జనసేన మధ్య సీట్ల వ్యవహారం రోజురోజుకు  హాట్ టాపిక్ గా  మారుతోంది.  టీడీపీ, జనసేన పార్టీ అధినేతల మధ్య ఈ విషయంలో సానుకూల వైఖరి ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం  చిన్నచిన్నగా వివాదాలు రేగుతున్నాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు విషయం రెండు పార్టీల నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కొన్ని కీలక నియోజకవర్గాలలో ఈ తలనొప్పులు తయారవగా.. చాపకింద నీరులా పెద్ద నేతల మధ్య కూడా వాజ్యం రాజుకుంటోంది.

పొత్తులు కుదరకముందు నుంచీ  రాబోయే ఎన్నికల కోసం కొన్ని నియోజకవర్గాలపై అటు టీడీపీ ఇటు జనసేన కు చెందిన కొంతమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఒక్క సీటు మాత్రమే గెలిచిన జనసేన పార్టీ ఇప్పుడు బలోపేతం కావడంతో టికెట్ ఇస్తే చాలు.. గెలిచి చూపిస్తామన్న కసితో జనసేన నేతలు ఉన్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా పట్టుదలగానే ఉండడంతో, టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న సీనియర్లలో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో టికెట్ రాని సీనియర్లు పార్టీ మారడానికి వస్తున్నారు .

ఇప్పటికే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటు విషయంలో.. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నాదెండ్ల మనోహర్.. తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎప్పటి నుంచో ప్లానులు వేసుకున్నారు. నాదెండ్లకే టికెట్ ఇచ్చే విషయంలో పవన్ కూడా  క్లారిటీతోనే ఉన్నారు. అయితే పొత్తుల లెక్కలతో తెనాలి సీటు నాదెండ్లకు వెళ్తే..ఆ సీటుపైన ఎన్నాళ్లనుంచో గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిరాసకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో  ఈ టికెట్ ఎవరికి దక్కుతుందో అనేది  ఆసక్తికరంగా మారింది.

మరోవైపు తెనాలి నుంచి తాను పోటీ చేస్తానని.. ఇప్పటికే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రకటించి తన  ఏర్పాట్లు  కూడా చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై  టీడీపీ, జనసేనలు క్లారిటీ ఇచ్చేసాయి. నారా లోకేష్ తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కే ఇవ్వబోతున్నట్లు తన సైడు నుంచి సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆలపాటి  రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. అయితే ఆలపాటికి గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా  ప్రచారం జరుగుతుంది.

తెనాలి  టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా తాజాగా ప్రకటించారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. తెనాలి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం  ఎక్కువగా ఉండడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. అందుకే అక్కడ ఆలపాటికి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్  మాత్రం తాను తెనాలి అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టుకుని కూర్చున్నారట. ఇప్పుడు తెనాలి సీటును నాదెండ్ల మనోహర్ కు ప్రకటిస్తే…. ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజకీయ అడుగులు ఎటు పడతాయన్న చర్చ  జోరుగా జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =