తెలంగాణకు సీఎంగా వుంటూనే దేశమంతా పర్యటిస్తా, మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్ర: సీఎం కేసీఆర్

Bharat Rashtra Samithi Highlights of Party Chief CM KCR Speech at Telangana Bhavan, CM KCR Speech at Telangana Bhavan, Bharat Rashtra Samithi Highlights, Telangana CM KCR Announces New National Party, KCR Launches National Party, Bharat Rashtra Samithi, TRS Party Renamed, Mango News, Mango News Telugu, KCR National Party , TRS Party Live News And Updates, KCR New Party, BRS Party , TRS as Bharat Rashtra Samithi, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KCR, KTR, Kavitha Kalavakuntla

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మార్చుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్టోబర్ 5, దసరా నాడు తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జయ జయ ధ్వానాలతో సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు.

సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “ఏపని చేసినా అర్థవంతంగా ప్రకాశవంతంగా చేయాలి. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృష్యంలో ప్రారంభమైన మనం, నాటి సమైక్య పాలనలో కృంగి కృషించి పోయిన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకోని ముందుకు సాగినం. రాష్ట్రాన్ని సాధించుకుని అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నం. ఇవన్నీ ఎట్లా సాధ్యమైతున్నవి అని పక్కరాష్ట్రాల వాల్లు ఆశ్చర్య పడుతున్నరు. ఎంచుకున్న కార్యాన్ని వొక యజ్జం లాగా దీక్షలాగా చేసుకుంటూ వచ్చినం కాబట్టే ఇదంతా సాధ్యమైతున్నది. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం గద్దెను దిగడం తప్ప దేశానికి చేసిందేమిలేదు. జై తెలంగాణ నినాదంతో మనమే ఉద్యమించినం, మన నెత్తిన భారం పెట్టుకున్నం, అనుకున్నది సాధించినం. ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆట వంటిది కానీ టీఆర్ఎస్ పార్టీ కి అదో టాస్క్ వంటిది. తెలంగాణ అభివృద్ధికోసం కార్యకర్తల్లాగా మనం కమిట్మెంట్ తో పనిచేసినం. అంతగా కష్టపడ్డం కాబట్టే గొప్ప గొప్ప విజయాలు సాధించినం. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉండే, కానీ నేడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగింది. తెలంగాణ జిఎస్డీపీ 2014లో 5 లక్షల 6 వేలుంటే నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నది” అని తెలిపారు.

జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్ననిర్ణయం కాదు:

“ఇంతటి అభివృద్ధిని సాధించడానికి మనం తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే. దేశం కోసం కూడా మనం కష్టపడి పనిచేసి సాధించి చూపెడుదాం. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్ననిర్ణయం కాదు. అన్నీ చేసి చూయించి బలమైన పునాదుల మీదినించే నిర్ణయం తీసుకుంటున్నం. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలు దేశం రెండు కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యం. మన తెలంగాణ జీఎస్డీపీ వాస్తవానికి 14.5 లక్షల కోట్ల రూపాయలుండాల్సింది. కానీ హ్రస్వదృష్టితో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల ఇంకా కూడా అందుకోవాల్సినంత అభివృద్దిని విజయాలను తెలంగాణ అందుకోలేక పోతున్నది. ఈ దేశ స్వాతంత్య్ర కోసం సాగిన నాటి త్యాగాలు చాలా వరకు నెరవేరకుండానే పోయినాయి. రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకటి లింగ వివక్ష, రెండోది కుల వివక్ష. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతున్నది. అదే సందర్భంలో దేశ జనాభాలో 20శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నరు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడ్డ వల్ల అభివృద్ధి జరగట్లేదు. అదే సందర్భంలో పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పబడే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నరు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదు. స్థూలమైన విషయాల్లో మౌలిక మైన మార్పు రాకుండా సమాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదు” అని అన్నారు.

దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం:

“ఏ దేశాలైతే ఏ సమూహాలైతే, తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పని విధానం నుంచి బయటపడతాయో, ఆ సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారినయి. మార్పుకోరుకోని సమాజాలు మారలేదు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయి. 1980 వరకు చైనా జీడీపీ మన దేశం కన్నాతక్కువగా ఉండేది. 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయి. నేడు దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్దరణకోసం అమలు చేస్తున్న కార్యక్రమం. సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయి. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికం. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకం. రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు, రైతుబంధు, రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఇదే విషయాన్ని ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్ కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలున్నాయి. వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ బాగుచేసుకుంటూ ముందుకు సాగుతాం” అని చెప్పారు.

భారతదేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు:

“తెలంగాణలో అమలవుతున్న ఇటువంటి ఆవిష్కరణలు దేశ స్వాతంత్య్రం వచ్చిన తొలినాల్లలోనే అమలు చేసి వుంటే బాగుండేది. మనం అవుటాఫ్ బాక్స్ నుంచి ఆలోచన చేసి వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరించినం కావట్టే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది. దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగం. దేశంలోని రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెల్ల కాలం పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణం. ఈ నేపథ్యంలో భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే మనం జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నం. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని మనం జాతీయ పార్టీ జెండాను పట్టుకోని పోతున్నం. మనం తలపెట్టిన చారిత్రక కార్యక్రమానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లు వస్తామన్నారు. కానీ వారి వారి పరిస్థితులను అర్థం చేసుకుని నీనే వద్దన్నాను. ఇది కేవలం పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమే. తర్వాత జరిగే లాంచింగ్ కార్య్రమానికి పిలుచుకుంటానని చెప్పాను. మనతో కలిసి ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మాజీ భారత ప్రధాని దేవగౌడ గట్టి మద్దతునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇటీవల కలిసి చర్చించినప్పుడు తమ జేడీఎస్ సంపూర్ణ మద్దతుంటుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు చేసినం. జాతీయ పార్టీ ఏర్పాటులో వారి సలహాలు తీసుకున్నం. వనరులుండీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచించబడుతున్నారు. ఇది శోచనీయం. ఈ పద్దతి మారాలే. మనమే మార్చాలె. మన తెలంగాణ ను ఎట్లయితే మనం బాగుచేసుకున్నమో, మన దేశాన్ని కూడా మనం బాగుచేసుకోవాలె” అని సీఎం అన్నారు

దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీళ్లను అందించాలి:

“ఈ దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి వున్నది. పుష్కలంగా నీరువున్నది. కష్టపడి పనిచేసే ప్రజలున్నరు. ఇన్నీ వున్న తర్వాత మన దేశం ప్రపంచానికే అన్నం పెట్టాలె. పలు రకాలనై పంటలను పండించి ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలె. అది వదిలి మనమే పిజ్జాలు బర్గర్లు తినడం అంటే అవమానకరం. మనం ఛాలెంజ్ గా తీసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీళ్లు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా ? దేశమంతా ఇవ్వొచ్చు. మనం అదే కమిట్ మెంట్ తో దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీళ్లను అందించాలె. ఇందుకు చైనాతో పాకిస్తాన్ తోనో అమెరికా తోనో యుద్దం చేయాల్సిన అవసరం లేదు. కేవలం చిత్తశుద్ది ఉంటే చాలు. శుద్ది చేసిన మంచినీల్లను దేశమంతా అందించగలం. ఈ సమావేశంలో కూర్చున్న వాల్లంతా తెలంగాణ సాదించిన యోధులు. వీరు అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా వున్నారు” అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుంటూనే దేశమంతా పర్యటిస్తా:

“నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వుంటూనే దేశమంతా పర్యటిస్తా. కార్యక్షేత్రం వదలం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నది. మన దేశంలోని వనరులు మన దేశంలోనే వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం. మనకు ఇంకా మంచి సమయం ఉన్నది. మనం దేశవ్యాప్తంగా విస్తరిస్తం. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటం. మన జాతీయ పార్టీ కి అనుబంధ రైతు సంఘటనను మొదట మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతది. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా వున్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తాం. ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించింది. తలెత్తున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతాం. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలె. తెలంగాణ లో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించినం. పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నం. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యం. ఒక అద్భుతమైన తాత్విక పునాదితో ముందుకు సాగుతాం. దేశవ్యాప్తంగా సాగే క్రమంలో అందరి సహకారం అవసరం. ఎట్లయితే పట్టుదలతో తెలంగాణ ప్రజలను గెలిపించినమో, అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో మనం గెలిపిస్తాం’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =