ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్రొబేషన్ లోనూ మెటర్నిటీ సెలవులకు అనుమతి

AP Govt Gives Orders on 180 Days Maternity Leave for Women Employees, AP Govt On Maternity Leave for Women, AP News, AP State Govt Extends 180 Days Maternity Leaves to Women, Maternity Leave for Women Employees in Village, Maternity Leave for Women Employees in Village Secretariats, Maternity Leave for Women In Ward Secretariats, Sanction of Maternity Leave In AP, Ward Secretariats

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు శుభవార్త అందించింది. ప్రొబేషన్ సమయంలో కూడా అర్హులైన మహిళా ఉద్యోగులు 180 రోజుల పాటుగా మెటర్నిటీ సెలవులను ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సెప్టెంబర్ 25, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషన్ లో సమయంలో కూడా మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మహిళా ఉద్యోగులు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ధన్యవాదాలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =