ఏపీ సీఎం జగన్ తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Mango News Telugu, Niti Aayog Vice-Chairman Meets AP CM Jagan In Amaravati, Niti Aayog Vice-Chairman Meets AP CM YS Jagan, Niti Aayog Vice-Chairman Meets AP CM YS Jagan In Amaravati

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ రోజు ఉదయం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుపై చర్చలు జరిపారు. విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ పలు అంశాలు వివరించారు . ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ముఖ్యమంత్రి తో భేటీ అనంతరం అమరావతిలో ఉన్న జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ క్షేత్రాలను రాజీవ్ కుమార్ పరిశీలించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2024 కల్లా ఆంధ్రప్రదేశ్ ను ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా నిలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనలో అందుకు సంబంధించిన అంశాలను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ పరిశీలించబోతున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=9r1Xc4dbRys]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 7 =