రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్ పేరు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt has Changed Rythu Bharosa Centres Name, AP YSR Rythu Bharosa Centers, Dr YSR Rythu Bharosa Centers, Rythu Bharosa Centre In AP, Rythu Bharosa Centres, Rythu Bharosa Scheme, YSR Birth Anniversary, YSR Rythu Bharosa Scheme, YSR Rythu Bharosa Scheme In AP

రాష్ట్రంలో వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును పెడుతూ జూలై 6, సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి రైతు భరోసా కేంద్రాలను ‘డాక్టర్‌ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు’గా వ్యవహరించాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో రైతులకు దివంగత సీఎం వైఎస్ఆర్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా మే 30 వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ‌రైతు భరోసా కేంద్రాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =