ఏపీలో కొత్త జిల్లాలపై మరో ముందడుగు, అధ్యయన కమిటీ ఏర్పాటు

Andhra Pradesh, Andhra Pradesh Political News, AP Govt has Formed Committee to Study on New Districts Establishment, AP New Districts Establishment, AP News, New Districts Establishment In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆగస్టు 7, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. 25 జిల్లాల ఏర్పాటుకు ఈ కమిటీ అధ్యయనం చేయనుండగా, సీఎస్‌ నీలం సాహ్న అధ్యక్షత వహించనున్నారు. సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి ఈ కమిటీలో సభ్యలుగా ఉండనుండగా, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. అలాగే మూడు నెలలలోగా తుది నివేదికను అందించాలని పభుత్వం కమిటీకి గడువు విధించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =