ఏపీలో మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహించే అవకాశం

Tenth Class Exams in AP Likely to Conduct in the Month of May,Andhra pradesh,10th Class Exams,,Board exams,AP 10th Class Exams In May,Andhra Pradesh News,SSC Exams In Ap 2021 Andhra Pradesh Government May Conduct 10Th Class Exams In May 2021,AP 10th Class Public Exams 2021,AP 10Th Class,AP 10th Class Exams 2021,AP SSC Exam Dates 2021,AP SSC Exams,AP 10th Timetable,AP 10th Class Exams 2021,AP SSC Exams 2021,AP Ssc Timetable 2021,AP SSC Latest News,AP 10Th Exams Schedule,AP 10Th Class Exams Schedule,10th Class Exams,AP Schools Reopen Date,AP Schools Reopening Date,AP Schools Reopen When,AP 10th Class,Mango News,Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించే అవకాశముందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఇతర సంబంధిత అధికారులతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే నెలలో పదో తరగతి పరీక్షలు జరగొచ్చని, అయితే పదో తరగతి‌ పరీక్షలకు ఎన్ని పేపర్లు ఉంటాయనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

పేపర్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ప్రస్తుతం పేపర్ల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. మరోవైపు అన్ని పాఠశాలల్లో ఏప్రిల్‌ 30 వరకు తరగతులు కొనసాగుతాయని చెప్పారు. ఇక జనవరి 6, 7, 8 తేదీలలో 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు, జనవరి 21, 22, 23 తేదీలలో 7, 8 తరగతులకు ఫార్మేటివ్‌–1 పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల మొదటి, మూడో శని వారాల్లో విద్యార్థులకు నో బ్యాగ్‌ డేను తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + six =