దసరా సమయంలో 1,850 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న ఏపీఎస్ఆర్టీసీ

Andhra Pradesh State Road Transport Corporation, AP Bus Services, AP Bus Services During Dussehra Festival, APSRTC, APSRTC Latest News, APSRTC News, APSRTC To Run Special Buses During Dussehra Festival, Dussehra festival, Special Buses During Dussehra Festival

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్దమయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరియు కర్ణాటక రాష్ట్రానికి నడిపే బస్సులతో కలిపి మొత్తం 5950 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది. వీటికి అదనంగా దసరా పండుగను పురస్కరించుకుని 1,850 ప్రత్యేక సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా శుక్రవారం నుంచి అక్టోబర్ 26 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ దసరా పండుగకు 2,500కు పైగానే ప్రత్యేక బస్సులు నడుపుతుండగా, ఈసారి తెలంగాణ రాష్ట్రంతో అంతర్రాష్ట్ర ఒప్పందం పూర్తికావకపోవడంతో ప్రత్యేక బస్సుల సంఖ్య బాగా తగ్గింది. కర్ణాటకలోని బెంగళూరుకు మాత్రం పండుగ సమయంలో 562 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

దసరా సమయంలో జిల్లాలవారీగా ఏపీఎస్ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల వివరాలు:

 • కృష్ణా-176
 • గుంటూరు-50
 • ప్రకాశం-68,
 • నెల్లూరు-156
 • తూర్పుగోదావరి-342
 • పశ్చిమగోదావరి-40
 • శ్రీకాకుళం-66
 • విజయనగరం-66
 • విశాఖపట్నం-128
 • చిత్తూరు-252
 • కర్నూలు-254
 • కడప-90
 • అనంతపురం-228

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here