ఏపీలోవాలంటీర్ల ఖాళీల భర్తీ విషయంలో కీలక నిర్ణయం, ప్రతి నెలా భర్తీ జరిపేలా ఆదేశాలు

AP Govt Issued Orders To Fill Vacancies of Village, Ward Volunteers in Each Month,AP Govt Issued Orders To Fill Vacancies Ward Volunteers,Ward Volunteers,AP Govt,AP Govt To Recruit Village Volunteers, Ward Volunteers On Monthly Basis,Andhra Pradesh Chief Minister Ys Jagan Mohan Reddy,Andhra Pradesh,AP Village And Ward Volunteer Posts To Be Recruited On Monthly Basis,AP Volunteers,Mango News,Mango News Telugu,AP Village And Ward Volunteers,Andhra Pradesh News,AP Govt Latest News,AP Govt To Fill Vacancies of Village And Ward Volunteer Posts

రాష్ట్రంలో గ్రామా, వార్డు వాలంటీర్ల ఖాళీల భర్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రతి నెలలో 1 వ తేదీ నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఏర్పడ్డ వాలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ తమ పరిధిలోని వాలంటీర్ల ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. ఈ మేరకు గ్రామా, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ప్రస్తుతం 5154 గ్రామా, 1966 వార్డు వాలంటీర్ల పోస్టులు కలిపి మొత్తం 7,120 వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇక 35 ఏళ్లు పైబడిన వారిని వాలంటీర్ల విధుల నుంచి ప్రభుత్వం తొలగిస్తోందని వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని కమిషనర్‌ నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన ఆరుగురిని మాత్రమే తొలగించేలా చర్యలు తీసుకున్నామని, ఇతరులను ఎవరిని తొలగించడం లేదని స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =