ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలని, అందులో మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. బుధవారం తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహా పలువురు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- మాండస్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు పరిహారం సిద్ధం చేయాలి.
- రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా ఈ-క్రాప్ డేటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరపాలి.
- ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయంతోనే రైతుల పని ముగియాలి.
- ఆ తర్వాత ప్రక్రియ బాధ్యత అంతా ప్రభుత్వమే పర్యవేక్షించాలి.
- ఒకవేళ దీనిలో మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లయితే ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్ ఏర్పాటు చేయాలి.
- రైతుల ఫిర్యాదులపై సత్వరం స్పందించి తగు చర్యలు చేపట్టాలి.
- వ్యవసాయ శాఖ అధికారులు ఈ వ్యవహారం మొత్తాన్ని దగ్గరుండి చూసుకోవాలి.
- అన్ని ఆర్‌బీకే కేంద్రాలలో విత్తనాలు మరియు ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలి.
- అలాగే ప్రతి ఆర్‌బీకే కేంద్రంలో సాయిల్ టెస్ట్ పరికరాలు అందుబాటులో ఉంచాలి.
- రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సాయిల్ టెస్టింగ్ తర్వాత మ్యాపింగ్ జరగాలి.
- తద్వారా ఎరువులు, రసాయనాల వినియోగం పరిమితంగా జరిగి రైతులకు పెట్టుబడి ఆదా అవడమే కాకుండా, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
- ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ పైన కార్యాచరణ మరియు సాయిల్ టెస్టింగ్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చేపట్టాలి.
- ఇక సాయిల్ టెస్టింగ్ తర్వాత రైతులకు సర్టిఫికెట్లు జారీ చేసి, ఫలితాల ఆధారంగా ఆయా భూముల్లో ఏఏ పంటలు పండించాలో వారికి సూచనలు అందించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE