ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ పెంపు

AP Govt Issues Orders on Increasing Reservations in Jobs and Promotions For Disabled Persons, AP Govt Issues Orders On 4% Reservation For Disabilities, AP Govt Issues Orders on Increasing Reservations, AP Govt Issues 4% Reservation, Mango News, Mango News Telugu, AP Govt Issues Orders Reservations in Jobs, AP Govt Issues Orders Promotions , AP Govt Issues Orders Reservations For Disabled Persons, AP Govt Reservations, AP Govt Latest News And Updates, AP Govt Jobs and Promotions For Disabled Persons

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో వికలాంగులకు 4శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. కాగా ఇప్పటివరకు 3శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. ఇప్పుడు దానిని 4శాతానికి పెంచారు. ఇక దీనికి సంబంధించి రిజర్వేషన్ పెంపుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996లో సవరణ చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 19, 2020 తేదీన మహిళా శిశు సంక్షేమ శాఖ, వికలాంగుల సంక్షేమ శాఖ నిర్ధారిత వైకల్యమున్న దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగుల హక్కుల చట్టం 2016లోని సెక్షన్ 34 ప్రకారం దీనిని జారీ చేశారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =