తెలంగాణలో 375 కిమీ మేర రాహుల్​ గాంధీ భారత్​ జోడోయాత్ర, రూట్ ​మ్యాప్ ఖరారు

Rahul Gandhi Bharat Jodo Yatra Enters into Telangana on October 23rd, Route Map Finalized

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్​గాంధీ పాదయాత్ర అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో మొత్తం 375 కిమీ మేర రాహుల్​ గాంధీ పాదయాత్ర కొనసాగనుండగా, ఇందుకు సంబంధించిన రూట్​ మ్యాప్​ కూడా ఖరారైంది. గురువారం హైదరాబాద్​ లోని గాంధీభవన్​లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్​ నేతలు సమావేశమై తెలంగాణలో రాహుల్​గాంధీ భారత్​ జోడో యాత్ర రూట్ మ్యాప్​, సన్నాహకాలపై చర్చించారు.

ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో 375 కిమీ మేర భారత్​ జోడోయాత్ర జరుగుతుందని, అక్టోబర్ 23న కర్ణాటక నుంచి కృష్ణ రివర్ బ్రిడ్జి మీదుగా మక్తల్​ నియోజకవర్గంలోకి రాహుల్​ గాంధీ పాదయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. ఈ యాత్ర హైదరాబాద్‌ మీదుగా మద్నూర్‌ వరకు కొనసాగనుందని చెప్పారు. అక్టోబర్ 31 హైదరాబాద్​లోకి ప్రవేశించనుండగా, చార్మినార్ నుంచి నెక్లెస్​రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు యాత్ర కొనసాగి, అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రేవంత్​రెడ్డి తెలిపారు.

తెలంగాణలో రాహుల్​ గాంధీ ‘భారత్​ జోడోయాత్ర’ రూట్ ​మ్యాప్ (375 కిమీ):

రాహుల్​ గాంధీ భారత్​ జోడోయాత్ర కృష్ణ రివర్ బ్రిడ్జి మీదుగా మక్తల్, దేవరకద్ర, మహబూబ్​నగర్ టౌన్, జడ్చర్ల, షాద్​నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్ పురా, చార్మినార్, ఆఫ్జల్ గంజ్, మోజంజహి మార్కెట్, గాంధీభవన్, నెక్లెక్​రోడ్​, బోయిన్​పల్లి, బాలానగర్, మూసాపేట వై జంక్షన్, కూకట్​పల్లి, మియాపూర్, బీహెఛ్ఈఎల్, పటాన్​చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగీపేట్, శంకరంపేట్, మద్నూర్‌ వరకు సాగనుంది.

  • కృష్ణ రివర్ బ్రిడ్జి-మక్తల్: 18 కిమీ
  • మక్తల్-మహబూబ్​నగర్ టౌన్: 65 కిమీ
  • మహబూబ్​నగర్ టౌన్-జడ్చర్ల: 17 కిమీ
  • జడ్చర్ల-షాద్​నగర్: 34 కిమీ
  • షాద్​నగర్-శంషాబాద్: 29 కిమీ
  • శంషాబాద్-ముత్తంగి(ఓఆర్ఆర్): 60 కిమీ
  • ముత్తంగి(ఓఆర్ఆర్)-సంగారెడ్డి క్రాస్ రోడ్: 17 కిమీ
  • సంగారెడ్డి క్రాస్ రోడ్-జోగీపేట్: 37 కిమీ
  • జోగీపేట్-శంకరంపేట్: 34 కిమీ
  • శంకరంపేట్-మద్నూర్‌: 64 కిమీ.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 6 =