ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు, ఎంతంటే?

AP Govt Issues Orders To Increase HRA From 12 to 16 Per Cent For Government Employees in New Districts,AP Govt Issues Orders To Increase HRA,Increase HRA From 12 to 16 Per Cent,Increase HRA From 12 to 16 Per Cent For Government Employees,AP Government Employees in New Districts,Mango News,Mango News Telugu,HRA of government employees,HRA of government employees in HQ,AP Govt Issues,AP Govt Issues Latest News,AP HRA,AP HRA Latest News And Updates,AP Government Employees Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ)కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న12 శాతం నుంచి 16 శాతానికి హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పని చేసే ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులకు పెంపుదల వర్తిస్తుందని పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ తొమ్మిది జిల్లాలోని హెడ్ క్వార్టర్స్‌లో నియమించబడిన ఉద్యోగులకు పెంచబడిన 16 శాతం హెచ్ఆర్ఏని వచ్చే నెల జూన్ నుండి అందించనున్నట్లు తెలిపింది. నిర్ణీత జనాభా ప్రాతిపదికన పైన పేర్కొన్న తొమ్మిది జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచినట్లు వెల్లడించింది. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =