తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా.. బ్రిటన్‌ పర్యటనకు మంత్రి కేటీఆర్‌, ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

Minister KTR Leads Delegation To UK Visit For Investments in Telangana Receives Grand Welcome by NRIs at London Airport,Minister KTR Leads Delegation To UK Visit,UK Visit For Investments in Telangana,Grand Welcome by NRIs at London Airport,Mango News,Mango News Telugu,Invest in Telangana,KTR Leads Telangana Delegation To UK,Telangana Minister KTR,KTR UK Visit,KTR UK Visit For Investment,KTR UK Visit For Investment In Telangana,KTR Latest News And Updates,KTR UK Visit Latest News And Updates,KTR Receives Grand Welcome by NRIs

ప్రపంచ కంపెనీలకు పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రదర్శించేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు బుధవారం లండన్‌ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) వెళ్లిన ఆయన బృందానికి లండన్‌లో ఘనస్వాగతం లభించింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో దిగిన మంత్రికి పలువురు ఎన్నారైలు మరియు యూకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వింగ్ సభ్యులు స్వాగతం పలికారు. ఇక నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు మూడు రోజుల పర్యటనలో మంత్రి కేటీఆర్‌ పలు బ్రిటన్‌ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార సంఘాలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడికి గల అపార అవకాశాలు, అనుకూల వాతావరణం, వివిధ పరిశ్రమల రంగాల్లో రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతిని వారికి వివరించనున్నారు. ‘ఐడియాస్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్ -2023’ అనే సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా యూకే , యూరప్ మరియు భారతదేశానికి చెందిన వ్యాపార, పరిశ్రమ మరియు విధాన నాయకులను ఒకచోట చేర్చి ఆర్థికంగా మరియు దేశంగా భారతదేశం యొక్క తదుపరి అభివృద్ధి గురించి చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గతేడాది బ్రిటన్‌ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను, ఆయా రంగాల్లోని ఎకోసిస్టంను వివరించడం సత్ఫలితాలనిచ్చింది. దీనిలో భాగంగా పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే యూకేతో పాటు అమెరికా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, తైవాన్‌ తదితర దేశాలకు చెందిన సంస్థలు పరిశ్రమలు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇక ఈనెల 13న బ్రిటన్‌ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ రానున్న కేటీఆర్‌, 15న కొంగరకలాన్‌లో నిర్వహించే ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 2 =