పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్, కొనసాగుతున్న చికిత్స

actor Pawan Kalyan tests positive, COVID-19, Jana Sena Party leader, JanaSena Party Chief, JanaSena Party Chief Pawan Kalyan, Janasena Party Chief Pawan Kalyan Tested Positive, Janasena Party Chief Pawan Kalyan Tested Positive for Covid-19, Mango News, pawan kalyan, Pawan Kalyan Tested Positive, Pawan Kalyan Tested Positive for Covid-19, Pawan Kalyan tests positive for coronavirus, Pawan Kalyan tests positive for COVID-19, Powerstar Pawan Kalyan tests Covid positive

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‌”జనసేన అధ్యకులు పవన్ కళ్యాణ్ కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న తరవాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్ గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగిళ్ళ సుమన్ హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ కు చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు” అని పేర్కొన్నారు.

“చిరంజీవి గారు, వదిన శ్రీమతి సురేఖ గారితో పాటు రామ్ చరణ్, ఉపాసన ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రంలోనే చికిత్సకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ ను పరీక్షించింది. అపోలో ఆస్పత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ కళ్యాణ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. జ్వరం, ఊపిరితిత్తుల్లోని నిమ్ము, ఒళ్లునొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు, అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు” అని జనసేన పార్టీ పేర్కొంది.

“తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన సుమన్ పాండిచ్చేరిలో వైద్య విద్యను అభ్యసించారు. కాకినాడకు చెందిన ప్రముఖులు తోట హనుమంతరావు గారి మనవరాలు డా.కావ్యను డా.సుమన్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు డా.సుమన్ అత్యంత ఆప్తులు. ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్ గా ఎప్పటికప్పుడు తగిన సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా డా.సుమన్ పవన్ కళ్యాణ్ ఎన్నంటే ఉండి తగిన వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్మాత నాగ వంశీ గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, వైద్య సేవలను సమన్వయం చేస్తున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =