ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డులకై రెండు విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నామినేట్

Golden Globe Awards 2023 SS Rajamouli's RRR Bags Two Nominations,RRR Film Nominated In 2 Categories,Golden Globes Awards 2023,RRR Nominated In Golden Globes Awards,Mango News,Mango News Telugu,Jr Ntr,Akshay Kumar,Future Of Young India,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates,Golden Globe Awards,RRR Golden Globe Awards,Golden Globe Awards RRR

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే దేశంతో సహా యూఎస్, జపాన్ లలో కలెక్షన్స్ కొల్లగోట్టిన ఆర్ఆర్ఆర్, పలు అంతర్జాతీయ అవార్డులను కూడా దక్కించుకుంటుంది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ ‘బెస్ట్ డైరెక్టర్‌’ సహా పలు అవార్డులు అందుకోగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి కూడా పలు అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ తాజాగా ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్ గ్లోబ్స్-2023’ అవార్డుల నామినేషన్ల జాబితాలో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నామినేట్ చేయబడింది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనా 1985, క్లోజ్ అండ్ డెసిషన్ టు లీవ్‌ అనే చిత్రాలతో ఆర్‌ఆర్‌ఆర్ పోటీపడుతోంది.

అలాగే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని సాంగ్ ‘నాటు నాటు’ (మ్యూజిక్:ఎంఎం కీరవాణి, గానం: కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్) బెస్ట్ సాంగ్-మోషన్ పిక్చర్ విభాగంలో నామినేట్ చేయబడింది. ఈ విభాగంలో వేర్ ది క్రాడాడ్స్ సింగ్ చిత్రం నుండి ‘కరోలినా’, గిల్లెర్మో డెల్ టోరో పినోచియో నుండి ‘సియావో పాపా’, టాప్ గన్ మావేరీక్ నుండి ‘హోల్డ్ మై హ్యాండ్’, బ్లాక్ పాంథర్:వకాండ ఫరెవర్‌ చిత్రం నుండి “లిఫ్ట్ మి అప్” సాంగ్స్ తో నాటు నాటు సాంగ్ పోటీ పడుతుంది. సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల కోసం ఆర్‌ఆర్‌ఆర్ రెండు కేటగిరీల్లో నామినేట్ కావడంతో రాజమౌళికి, చిత్ర బృందానికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

రాజమౌళి ట్వీట్ చేస్తూ, “ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని రెండు విభాగాల్లో నామినేట్ చేసినందుకుగోల్డెన్ గ్లోబ్స్ జ్యూరీకి ధన్యవాదాలు. మొత్తం టీమ్‌కి అభినందనలు, ప్రేమ మరియు మద్దతు తెలుపుతున్న అభిమానులు మరియు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ, “గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రెండు విభాగాలలో నామినేట్ అయినందుకు ఆనందంగా ఉంది. మన అందరికీ అభినందనలు, ఎదురు చూస్తున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here