ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: చంద్రన్న కానుక, ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతిపై సీబీఐ దర్యాప్తు

AP Cabinet Meeting Highlights, AP Cabinet Meeting Today, AP Cabinet sub-committee, AP Cabinet takes Crucial Decisions in Today Meeting, AP Cabinet wants CBI probe, CBI enquiry into Chandranna Kanuka, Chandranna Kanuka, Jagan CBI Enquiry on Chandranna Kanuka

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకం, టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటు, ఫీజు రియింబర్స్‌మెంట్, రామాయపట్నం పోర్టు నిర్మాణం, తదితర అంశాలపై కీలకంగా చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • జూన్ 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌ నెట్ (ఫైబర్‌ గ్రిడ్‌) టెండర్లు, చంద్రన్నకానుక, హెరిటెజ్‌ నెయ్యి కొనుగోళ్లలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు
  • 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్‌ఆర్ చేయూత పథకం కింద నాలుగేళ్ళ పాటుగా రూ.75 వేల ఆర్థిక సహాయం
  • చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద సున్నా వడ్డీకి రుణాలు అందించేందుకు కేబినెట్‌ ఆమోదం
  • తల్లులు, చిన్నారులకు మేలు చేసేలా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు అమలు
  • ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం, ఇళ్లు ఇచ్చాక 5 సంవత్సరాల పాటు నివాసం ఉన్నాకనే అమ్ముకునేలా నిబంధనలు
  • 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ఆమోదం.
  • బిల్డ్‌ ఏపీ కింద ఇప్పటికే గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాల అమ్మకానికి కేబినెట్‌ ఆమోదం
  • జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బును ఇకపై నేరుగా విద్యార్థుల తల్లుల అక్కౌంట్స్ లోకే వేయాలని నిర్ణయం.
  • టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు‌ ఆమోదం
  • రామాయపట్నం పోర్టు నిర్మాణంపై డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం, మొదటిదశలో రూ.3,736 కోట్ల వ్యయంతో ప్రణాళిక
  • 2700 ఎకరాల నుంచి 2200 ఎకరాలకు బోగాపురం ఎయిర్‌పోర్టు కుదింపు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =