ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. కోవిడ్-19 మృతుల కుటుంబాలకు రూ.10 కోట్లు ఎక్స్‌గ్రేషియా విడుదల

AP Govt Releases Rs.10 Crores Ex-gratia To The Kin of Who Lost Lives During Covid-19,Online Application For Covid Ex Gratia,Covid-19 Ex Gratia Payment In Ap,Covid-19 Ex Gratia Payment 2021,Mango News,Mango News Telugu,Covid-19 Ex Gratia Payment,Covid-19 Ex Gratia Assistance Payment System,Covid-19 Ex Gratia Application Form,Covid Ex Gratia Relief Application Form,Covid Ex Gratia Relief,Covid Ex Gratia Payment,Covid Ex Gratia Application Form,Covid Ex Gratia Ap Status,Covid 19 Relief Ex Gratia,Covid 19 Ex Gratia

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 కోట్లు ఎక్స్‌గ్రేషియా విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్యను బట్టి నిధులు విడుదల చేశారు. అలాగే పరిహారం సొమ్మును బాధిత కుటుంబాలకు అందజేశాక, దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. కాగా ఈ ఉత్తర్వుల ప్రకారం.. కోవిడ్-19 కారణంగా మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున అందించనున్నారు. ఇక ఇప్పటికే ఈ రెండేళ్లలో కరోనా మహమ్మారి కారణంగా మరణించిన ఎంతోమంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించగా.. తాజాగా అప్పుడు పరిహారం అందని వారికి మరియు ఆ తర్వాత కోవిడ్-19తో మృతి చెందిన మరికొందరి కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 4 =