ఈ 19న హైదరాబాద్ కు ప్రధాని మోదీ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సహా 7 వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలు

PM Modi Telangana Tour on JAN 19 Development Projects Worth Rs 7000 Cr Including Vande Bharat Express,PM Modi Telangana Tour,PM Modi Development Projects,Development Projects Worth Rs 7000 Cr,Mango News,Mango News Telugu,Including Vande Bharat Express,Vande Bharat Express Route,Vande Bharat Express Price,Vande Bharat Express Timing,Vande Bharat Express Speed,75 New Vande Bharat Express Route,Vande Bharat Express Booking,Vande Bharat Express Route In Gujarat,Vande Bharat Express Ahmedabad To Mumbai,Vande Bharat Express Ticket Price,Vande Bharat Express Delhi To Katra,Vande Bharat Express Train Accident,Vande Bharat Express Train,Vande Bharat Express Chennai To Mysore,Vande Bharat Express Bangalore,New Vande Bharat Express,How Many Vande Bharat Express In India

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయింది. జనవరి 19, గురువారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేస్తూ, ఈనెల 19న తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైల్ ను ప్రారంభించడంతో పాటుగా రూ.7 వేల కోట్లకుపైగా విలువగల పలు ప్రాజెక్టులకు భూమిపూజ, మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. అలాగే పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసే బహిరంగసభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు.

ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులు:

  • వందేభారత్ ట్రైన్ (సికింద్రాబాద్-విశాఖపట్టణం) (హాల్టింగ్ స్టేషన్లు: వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి)
  • సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ (85 కి. మీ.లు) – రూ.1,410 కోట్లు
  • ఐఐటి హైదరాబాద్ (అడ్మిన్ బ్లాక్, అకడమిక్ బిల్డింగ్స్, హాస్టల్స్, క్వార్టర్స్, టెక్నాలజీ రీసెర్చ్ పార్క్, టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, గెస్ట్ హౌస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, క్యాంపస్ స్కూల్, ల్యాబొరేటరీ, హెల్త్ కేర్ ఫెసిలిటీ) – రూ.2,597 కోట్లు

ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న ప్రాజెక్టులు:

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు – రూ.699 కోట్లు
  • రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్, కాజీపేట్ – రూ.521 కోట్లు
  • మహబూబ్ నగర్-చించోలి 2/4 లేన్ల రహదారి విస్తరణ (0/00 కి.మీ.ల నుండి 60/255 కి.మీ.ల వరకు) – రూ.704 కోట్లు
  • మహబూబ్ నగర్-చించోలి 2/4 లేన్ల రహదారి విస్తరణ (60/255 కి.మీ.ల నుండి 102/834 కి.మీ. ల (NH-167N)వరకు) – రూ.632 కోట్లు
  • NH-161B జాతీయ రహదారిలోని నిజాంపేట-నారాయణఖేడ్-బీదర్ సెక్షన్ లో 0/000 కి.మీ.ల నుండి 45/946 కి.మీ.ల వరకు రహదారి విస్తరణ – రూ.513 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 8 =