ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండండి.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి

ICC U19 World Cup 2022 Virat Kohli Interacts with Young Players Ahead of Final Against England

ఆర్టీసీని కాపాడుకునేందుకు ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండాలని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి చేశారు. తాజా పీఆర్సీకి, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధం లేదన్నారు. దీనిపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ.6,200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ.6 వేల కోట్ల అప్పులున్నాయని ఆయన గుర్తుచేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వలన ఆదాయం లేకపోవడంతో కేవలం రూ.1,490 కోట్లే తీర్చగలిగామని చైర్మన్‌ చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బయటి వ్యక్తులు చెప్పిన మాటలకు ప్రభావితమై ఉద్యోగులు సమ్మెకు దిగితే.. సంస్థకు కోలుకోలేని నష్టం జరుగుతుందని మల్లికార్జునరెడ్డి అన్నారు. మళ్ళీ ఆ భారం కూడా తిరిగి ఉద్యోగులపైనే పడుతుందని ఆయన చెప్పారు.

గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం కారణంగా అక్కడి ఉద్యోగుల ప్రయోజనాలకు ఎంత నష్టం కలిగిందో తెలుసుకోవాలని మల్లికార్జునరెడ్డి సూచించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లరనే తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనట్లేదని ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు. ఇక మిగిలిన సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సీఎం జగన్‌ చేసిన మేలును మర్చిపోవద్దని సంస్థ ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్‌ సూచించారు. అలాగే, మిగిలిన సమస్యలను కూడా సీఎం జగన్‌ త్వరలోనే పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారుమల్లికార్జునరెడ్డి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =