చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని

AP Minister Kodali Nani Sensational Comments on Chandrababu Naidu, Kodali Nani Sensational Comments on Chandrababu Naidu, Sensational Comments on Chandrababu Naidu, Comments on Chandrababu Naidu, AP Minister Kodali Nani, AP Minister, Kodali Nani, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, NCBN, President Of Telugu Desam Party, Nara Chandrababu Naidu President Of Telugu Desam Party, Telugu Desam Party President, Telugu Desam Party President Nara Chandrababu Naidu, Sensational Comments, AP Minister Kodali Nani Sensational Comments on Telugu Desam Party President, AP Minister Kodali Nani Sensational Comments on Telugu Desam Party President Nara Chandrababu Naidu, Minister for Civil Supplies and Consumer Affairs Kodali Nani, Minister for Civil Supplies and Consumer Affairs, Minister for Civil Supplies and Consumer Affairs in the state of Andhra Pradesh, Andhra Pradesh, Manog News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (మంగళవారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ మరణాలపై కూడా రాజకీయం చేస్తోందని విమర్శించారు. సహజ మరణాలను మద్యం మరణాలుగా దుష్రచారం చేయడం తగదని మంత్రి కొడాలి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు కావాలనే వీటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని, తద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని మంత్రి నాని మండిపడ్డారు. 60 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు.

జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలని, అక్కడ కొంతమంది ఎప్పుడో చనిపోతే టీడీపీ సభ్యులు ఇప్పుడు రాద్దాంతాం చేస్తున్నారని  కొడాలి నాని విమర్శించారు. 3వ తేదీ నుంచి మృతి చెందితే, కల్తీ మద్యం తాగి చనిపోయాడని పోలీస్ కేసు పెట్టాలి కదా. కానీ, ఇప్పటివరకు ఎవరూ అలంటి ఫిర్యాదులు చేయలేదు. పోస్ట్ మార్టం చేయలేదు. అనారోగ్యంతో చనిపోయినవారిని కూడా మద్యం మరణాలుగా చూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇలాంటి ప్రతిపక్షం రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడుతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు నడుపుతామంటే కుదరదని, వైసీపీ నాయకులు చూస్తూ ఊరుకోరని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here