ఏపీలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Andhra Pradesh HC, AP MPTC ZPTC Election Results, AP MPTC ZPTC Election Results 2021, AP MPTC ZPTC Elections Counting Process Updates, Mango News, MPTC ZPTC Elections Counting, MPTC ZPTC Elections Counting Process, ZPTC and MPTC elections, ZPTC and MPTC Elections Counting, ZPTC MPTC Counting, ZPTC MPTC polls

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవగా, ఇప్పటికే పలు జిల్లాల్లోని, పలు స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుంది. అన్ని జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారు. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన, ఇతర పార్టీలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపగలిగాయి.

ముందుగా రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ స్థానాలు, 7,220 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 515 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 2,058 మంది అభ్యర్ధులు పోటీ చేయగా, 7,220 ఎంపీటీసీ స్థానాలకు గానూ 18,782 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. ఈ రోజు ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లోని కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేశారు. 11,803 కౌంటింగ్ సూపర్ వైజర్లు, 32,264 కౌంటింగ్ పర్శన్స్ ను నియమించారు.

రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి కమిషనర్ కార్యాలయంలో నుంచి 13 మంది అధికారులను నియమించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో గెలిచిన అభ్యర్థుల ర్యాలీలు, విజయోత్సవ వేడుకలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 6 =