జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండి

AP People Strongly Believe That Janasena Party Will Win In The Upcoming Elections, AP People Strongly Believe That Janasena Party Will Win, Janasena Party Will Win, AP People Strongly Believe, Janasena Party Will Win In The Upcoming Elections, Janasena, Megastar, Chiranjeevi, Pawan Kalyan, Chiranjeevi Video, TDP,YCP, BJP, Congress, AP Elections, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Janasena, Megastar, Chiranjeevi, Pawan Kalyan, Chiranjeevi Video, TDP,YCP, BJP, Congress, AP Elections

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అవడంతో.. ముఖ్యపార్టీల నేతలంతా ఎన్నికల ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇక పిఠాపురంలో అయితే ఈ జోష్ కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటికే  పవన్ కళ్యాణ్ గెలుపు కోసం.. మెగా హీరోలు సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ , జబర్దస్త్  టీమ్ మెంబర్స్ ప్రచారం చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకున్నారు. తాజాగా తమ్ముడి గెలుపు కోసం ఏకంగా  మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఎక్స్ ప్లాట్ ఫామ్  వేదికగా జనమే జయం అని నమ్మే జనసేనానిని గెలిపించండని చిరు ఓ వీడియోను రిలీజ్  చేశారు.

పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా కూడా.. అందరికీ మంచి చేయాలనే విషయంలో మాత్రం ముందు ఉంటాడని అన్నయ్య చిరంజీవి  తన తమ్ముడి కోసం చెప్పుకొచ్చారు. తన గురించి కంటే జనం గురించి ఆలోచించే మనస్థత్వం ఉన్న వ్యక్తి  తన తమ్ముడు కళ్యాణ్ బాబు అని అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఏదైనా మంచి చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం  తన సొంత సంపాదనను కూడా రైతుల కన్నీరు తుడిచిపెట్టడానికి ఖర్చుపెడతారని..జవాన్, కార్మికులకు  సాయం చేస్తాడని పొగడ్తల వర్షం కురిపించారు. తను చేసిన ఇలాంటి సహాయాలు చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సింది అన్పిస్తుందని అన్నారు.

సినిమాలోకి పవన్ కళ్యాణ్ బలవంతంగా వచ్చాడని, రాజకీయాలలోకి మాత్రం తన ఇష్టంతోనే వచ్చాడని చిరంజీవి చెప్పుకొచ్చారు.  ఏ తల్లికైనా సరే తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని..అలాగే ఏ అన్నయ్యకు అయిన తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ కలుగుతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. అలా బాధపడుతున్న తన తల్లికి..తాను పవన్ కళ్యాణ్ అన్నయ్యగా ఓ మాట చెప్పానని అన్నారు. అమ్మా..నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం  యుద్ధం  చేస్తున్నాడని..అది  మన బాధ కంటే  ఎంతో గొప్పదని తన తల్లికి వివరించానన్నారు చిరంజీవి.

జనం కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుడు అయ్యాడని.. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయానికి అంకితం చేసిన శక్తి పవన్ కళ్యాణ్ అని చిరంజీవి చెప్పారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ ఆ శక్తిని వినియోగించాలంటే.. చట్ట సభల్లో పవన్ గొంతు వినాలని చిరు అన్నారు. జనమే జయం అని నమ్మే జనసేనానిని పిఠాపురం ప్రజలు గెలిపించాలని మెగాస్టార్ మెగా పిలుపునిచ్చారు. ప్రజలకు  పవన్ అండగా నిలబడతాడని.. పిఠాపురం ప్రజల కలలను నిజం చేస్తాడని..ప్రజలంతా  గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చిరంజీవి చేశారు. తమ్ముడు కోసం అన్నయ్య చిరంజీవి విడుదల చేసిన వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు, అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =