ల్యాండ్ టైటిలింగ్ చట్టం చుట్టూ రాజకీయాలు

Andhra Pradesh Is Heated Due To Political Pressure, Andhra Pradesh Is Heated, Political Pressure, TDP,YCP, BJP, Congress, AP Elections ,Pawan Kalyan, Modi, Amith Shah, Jagan, Chandra Babu,Land Titling Act, Assembly Elections, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP,YCP, BJP, Congress, AP Elections ,Pawan Kalyan, Modi, Amith Shah, Jagan, Chandra Babu,Land Titling Act

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో అజెండాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు ఏపీకి రావడంతో వైసీపీ నేతల పని అడకత్తెరలో పోకచెక్కలా తయారయింది. ఏపీలో కూటమి  ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా చేస్తున్న విమర్శలతో  వైసీపీ ప్రభుత్వంపై ఇరుకున పడుతోంది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో రాజధానుల నుంచి పోలవరం వరకూ అన్నీ ఎన్నికల అంశాలుగా మారాయి. దీంతో ఒక్కసారిగా  ముప్పేట దాడి ఎదుర్కొంటున్న వైసీపీ… ఈ  ఎన్నికల్లో గట్టెక్కుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌లో నిజాలన్నీ  పక్కనపెట్టి.. ఎన్నికల కోసం ప్రత్యర్ధి పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వాదిస్తున్న వైసీపీ  ఇస్తున్న సమాధానంతో ఏపీ వాసులు ఎంత వరకూ కన్వీన్స్ అవుతారోనన్న వాదన వినిపిస్తోంది.

ఏపీ రాజకీయాలలో  ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం హాట్ టాపిక్‌గా మారిపోయింది. పోలింగ్‌ సమయం దగ్గర పడటంతో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రచ్చ రోజురోజుకు పెరుగుతోండటంతో… తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అధికార వైసీపీ దీనిపై కేసులు పెడుతోంది. అయినా ప్రతిపక్షాలు ఈ ప్రచారాన్ని ఏ మాత్రం ఆపడం లేదు. తెలుగు దేశానికి అనుకూలంగా కొందరు మాజీ అధికారులు కుట్రపూరితంగా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. ల్యాండ్‌ యాక్ట్‌లో ఉన్న నిజాలను  దాచిపెట్టి ప్రజలను భయపెట్టి.. ఓట్లు దండుకునే ఎత్తుగడకు తెరతీస్తున్నారని వైసీపీ నేతలంతా మండిపడుతన్నారు.

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై  పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ  విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఏపీ డీజీపీని మార్చాలంటూ పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందడంతో.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేసి కొత్త డీజీపీగా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న హరీష్‌కుమార్‌ గుప్తాను  నియమించడం కూడా జరిగిపోయాయి. మరోవైపు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపైన కూడా ఈసీ బదిలీ వేటు వేసిని ఈసీ విధుల నుంచి తప్పించాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనికి ముందు పదుల సంఖ్యలో అధికారులపైన కూడా  వేటు వేసింది.

ఇటు ఏపీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర పెద్దలు  ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్‌షా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ల్యాండ్‌ మాఫియా, ఇసుక మాఫియా, వైన్‌ మాఫియాలు నడుస్తున్నాయని డైరక్ట్ అటాక్ చేశారు. జీవనాడి పోలవరం, రాజధాని ఆపేశారని ఆరోపించడంతో.. వైసీపీ నేతలంతా కంగుతిన్నారు. రాజకీయంగా కూటమితో పొత్తు ఉన్నా..తెర వెనుక తమకే సాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్న వైసీపీ మోడీ, షా విమర్శలతో షాక్ కొట్టినట్లు అయిపోయింది. పోనీ ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో అయినా తమ పాత్ర ఉన్నట్లు ఒప్పుకుంటారేమో విపక్షాల నోరు మూయించాలనుకున్న వైసీపీకి మోడీ, షా ద్వయం మాటలతో ఎన్నికలలో ఇప్పుడు  తమ గెలుపుపై అనుమానాలు కలుగుతున్నాయన్న టాక్ నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =