జనసేన పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్

AP Retired IAS Officer Vara Prasad Joined the Janasena Party, Retired IAS Officer Vara Prasad Joined the Janasena Party, IAS Officer Vara Prasad Joined the Janasena Party, IAS Vara Prasad Joined the Janasena Party, Janasena Party, Retired IAS Officer Deva Varaprasad Joins In Janasena Party, AP Retired IAS Officer Vara Prasad, IAS Officer Vara Prasad, AP Retired IAS Officer, Retired IAS Officer, Deva Vara prasad, AP Retired IAS Officer Vara Prasad Joined the Janasena Party Today, Janasena, Janasena Party News, Janasena Party Latest News, Janasena Party Latest Updates, Janasena Party Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి వరప్రసాద్ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

రాజోలు నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఏపీ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి, కమిషనర్, కార్మిక శాఖ కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో పనిచేశారు. జనసేనలో చేరిన అనంతరం వరప్రసాద్ మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చక్కబడి అభివృద్ధి చెందాలంటే మంచి నాయకత్వం అవసరం. అది పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ నమ్మకంతోనే జనసేనలో చేరాను. పవన్ కళ్యాణ్ తో కలసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =