వలసవాద పాలనా చిహ్నాలను చెరిపివేస్తున్న ప్రధాని మోదీ అభినందనీయులు – పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Says PM Modi is Commendable for Erasing the Symbols of Colonial Rule, Janasena Chief Pawan Kalyan Praises Modi, Janasena Chief Pawan Kalyan, PM Narendra Modi, Mango News, Mango News Telugu, PM Modi Erasing the Symbols of Colonial Rule, Pawan Kalyan, Narendra Modi, PM Narendra Modi, Indian Prime Minister Modi, Modi Erasing the Symbols of Colonial Rule, Prime Minister Of India, Janasena Chief Pawan Kalyan, BJP Party, Janasena Party

వలసవాద పాలనా చిహ్నాలను చెరిపివేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనీయులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం ప్రధాని మోదీ ‘కర్తవ్య పథ్’ ను ప్రారంభించి, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

“కర్తవ్య పథ్…భారతీయత ఉట్టిపడి నామదేయం. బ్రిటీష్ పాలనలో కింగ్స్ వే.. ఆ తరవాత రాజ్ పథ్ గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్ గా అవతరించింది. బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 ఏళ్ళు గడిచినా వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను తుడిచివేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనీయులు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంకల్పంతో వలసవాద పాలనలో ఉద్భవించిన పేర్లు మరియు చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆ వార్థానాన్ని అమలు చేస్తుండడం హర్షణీయం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం ఉంటే వీధిని రేస్ కోర్స్ గా పిలిచేవారు. ఇప్పుడు లోక కళ్యాణ్ మార్గ్ గా నామకరణం చేశారు. అది విధంగా భారతీయ వాయుసేన పతాకంలో సెయింట్ జార్జ్ క్రాస్ ఉండేది. దాని స్థానంలో నూతన పతాకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ గుణాత్మక చర్యలు బానిసవాదాన్ని నిర్మూలించే అభ్యుదయ చర్యలుగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి నాదోక విన్నపం. కర్తవ్య పథ్ లో సమరయోదుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ మహా వీరుని పట్ల మీకున్న భక్తిభావాన్ని చాటుకున్నారు. మీ చేతుల మీదుగానే జపాన్ లో భద్రపరచిన నేతాజీ ఆస్థికలను కూడా రప్పించవలసిందిగా కోరుతున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమరాలు రాజశ్రీ చౌదరీ బోస్ అనుమతితో ఆమె డి.ఎస్.ఏ.తో వాటిని సరిపోల్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ లక్ష్యం సిద్ధిస్తుంది. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందని భావిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − one =