కొడాలికి గుడివాడ టికెట్ లేనట్టేనా?

Kodali nani, YCP, CM Jagan, gudivada, AP Elections,TDP,YCP MLA Ticket,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh, Mango News Telugu,Mango News,AP updates
Kodali nani, YCP, CM Jagan, gudivada, AP Elections

సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈగ వాలినా సరే.. ఒంటి కాలిపై లేస్తుంటారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. పలు అంశాలపై సంచలన రీతిలో స్పందిస్తూ నాని ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటారు. ఇప్పటి వరకు నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి గుడివాడలో ఓటమి ఎరగకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ  ఎన్నికల్లో కూడా మరోసారి గుడివాడ నుంచి పోటీ చేసేందుకు కొడాలి నాని సిద్ధమవుతున్నారు.

కానీ ఇప్పుడు ఏపీలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. కొడాలి నానికి షాక్ తగలబోతోందని తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో కమ్మ, కాపు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈసారి తెలుగు దేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వెనిగండ్ల రాముని గుడివాడ నుంచి బరిలోకి దింపుతోంది. అటు జనసేనతో పొత్తు కారణంగా కాపు ఓట్లు కూడా పడుతాయని.. తద్వారా ఈ స్థానంలో గెలుపొందవచ్చని టీడీపీ భావిస్తోంది. ఎలాగైనా ఈసారి కొడాలి నానిని ఓడించాలని పావులు కదుపుతోంది.

అదే సమయంలో వైసీపీ గుడివాడలో చేయించిన పలు సర్వేలు కొడాలి నానికి వ్యతిరేకంగా వచ్చాయట. నానిపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిందట. అలాగే నిత్యం చంద్రబాబుపై నాని ఒంటికాలిపై లేస్తుండడంతో కాపులంతా ఆయనకు వ్యతిరేకంగా మారారట. అటు కాపులు జనసేనవైపే ఉండనున్నారు. దీంతో కొడాలి నానికి ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. సర్వేల్లో కూడా అదే తేలిందట. ఈ పరిణామాల మధ్య  ముందుకు పోయి ఓడడం కంటే క్యాండిడేట్‌ను మార్చడం మేలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.

ఈ మేరకు గుడివాడ నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే పలువురి పేర్లను కూడా పరిశీలించాటర. ఇదే సమయంలో సీఎం ఆఫీస్ నుంచి గుడివాడకు చెందిన సీనియర్ వైసీపీ నేత మండలి హనుమంతరావుకు పిలుపు వచ్చింది. వెంటనే ఆయన గుడివాడకు వెళ్లి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈక్రమంలో గుడివాడ వైసీపీ అభ్యర్ధి హనుమంతరావేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన అభిమానులు నియోజకవర్గంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.

హనుమంతరావు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో ఆయన్ను బరిలోకి దించడం ద్వారా కాపు ఓట్లు  పడడంతో పాటు.. ఎస్సీ ఓట్లు కూడా తమకే పడుతాయని.. ఈసారి కూడా గుడివాడలో గెలుపొందవచ్చని జగన్ అనుకుంటున్నారట. త్వరలో గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావుపేరును అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ పరిణామాల మధ్య జగన్‌కి అత్యంత విధేయుడిగా ఉండే నాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 5 =