ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 24,659 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 174 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా కృష్ణాలో 32, పశ్చిమగోదావరిలో 31, చిత్తూరులో 29, గుంటూరులో 26 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14426 గా ఉంది. గత 24 గంటల్లో 301 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,54,553 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,265 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ