ఆ నాలుగు స్థానాల్లో అలీని నిలబెట్టేది అక్కడ నుంచేనా?

Will Ali be given a seat?,Movie star Ali, Ali competition,CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Assembly Elections, Parliament Elections,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Will Ali be given a seat?,Movie star Ali, Ali competition,CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Assembly Elections, Parliament Elections

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండంతో.. వైసీపీ ఇంఛార్జ్‌ ల మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సిట్టింగ్ ఎంపీల్లో కొంతమందిని మార్చిన సీఎం జగన్ .. ఎమ్మెల్యేలుగా ఇంకొంతమందిని పోటీకి ఖరారు చేశారు. ఇప్పటికే 7 జాబితాలు రిలీజవడంతో.. ‌ఎప్పటి నుంచో జగన్ పై గంపెడాశలు పెట్టుకున్న సినీ నటుడు అలీ పోటీ వ్యవహారం మరోసారి పొలిటికల్ తెరమీదకు వచ్చింది. తాజాగా తాను పోటీకి సిద్దమని అలీ ప్రకటించడంతో..సీఎం జగన్ అలీని ఎక్కడ నుంచి నిలబెట్టబోతున్నారన్న చర్చ నడుస్తోంది.

గత ఎన్నికల్లో  వైసీపీ నిర్వహించిన సామాజిక బస్సు యాత్రల్లో అలీ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం పని చేసిన అలీకి..రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరిగినా..  ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించారు సీఎం జగన్. దీంతో రానున్న ఎన్నికల్లో అలీకి ఎంపీగా సీటు ఖాయమనే ప్రచారం పార్టీలో  సాగుతోంది. తాజాగా తాను పోటీకి సిద్దమని.. అధిష్టానం ఆదేశిస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని అలీ చెప్పారు. ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని అది గుంటూరా, నంద్యాలా లేక రాజమండ్రా అనేది వేచి చూడాలని అలీ చెప్పుకొచ్చారు.

పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తానెప్పుడూ కట్టుబడే ఉంటానని అలీ చెప్పారు. తాజాగా జరిగిన రాప్తాడు సిద్ధం సభ చూసాక.. వైసీపీ పట్ల ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని ..రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమంటూ ఆయన అన్నారు. అయితే అలీ ఎంపీగానే  పోటీ చేయటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వచ్చే వారం  జగన్ నేరుగా అలీతోనే చర్చించి పోటీ  గురించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మైనార్టీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గాల్లో అలీని  బరిలోకి దింపడానికి సీఎం  ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

కొద్ది రోజులుగా  నంద్యాల పార్లమెంటుకు అలీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కాకపోతే, నంద్యాలతో పాటు  కడప ఎంపీగా పోటీ చేయించే అంశం గురించీ కూడా జగన్ అనుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం  ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డిని ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కడప ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషా స్థానాన్ని   రెడ్డి లేదా బలిజ వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది . దీంతో, అలీ, అంజాద్ పాషా ల్లో  ఎవరో ఒకరికి జగన్.. ఎంపీగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం  వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =