ఉదార హృదయాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్

Jana Sena, Jana Sainiks, Pawan Kalyan, donations, jenasena chief, Pawan Kalyan showed a Generous Heart, Pawan Kalyan Generous Heart, JSP Party,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates, Mango News Telugu, Mango News
Jana Sena, Jana Sainiks, Pawan Kalyan

ఎప్పటికప్పుడు జనం కోసమే తాను అన్నట్లుగా ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్..మరోసారి  తన ఉదార హృదయాన్ని చాటుకున్నారు. కష్టం ఎక్కడ ఉన్నా అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటారన్న నమ్మకం పవన్ అభిమానుల్లో కలిగించిన పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆదుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా..తన ముందుకు వచచ్చిన  తన సహయం కోసం చేయి చాచి అడిగిన ఎంతోమంది  లేదనకుండా సాయం చేసిన మనసున్న మనిషిగా పవన్ అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.  సినిమాలు చేస్తూ చిన్నచిన్న హీరోలు కూడా ఆస్తులు కూడబెట్టుకుంటే తాను మాత్రం ఆత్మీయులను కూడబెట్టుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక పవన్ చేసే సాయం, సామాజిక సేవ కార్యక్రమాలు మరింతగా పెరిగాయి.

జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్క జనసైనికుడికి, ప్రతీ వీర మహిళకు బీమా వర్తింపజేస్తూ..పవన్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీని ద్వారా గతంలో ప్రమాదవశాత్తు చనిపోయిన కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తాజాగా పవన్  బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన  పవన్.. జనసేన బీమా రెన్యూవల్‌కి  మార్చితో గడువు  ముగిసిపోతుందని  తనకు పార్టీ ట్రెజరర్ చెప్పారని గుర్తు చేశారు.

ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ఈ మూడు నెలలు అంటే మార్చి నుంచి జూన్ వరకూ బీమా సొమ్ము రూ.3.50 కోట్లను తాను సినిమాల నుంచి సంపాదించిన డబ్బు నుంచి చెల్లిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. ఇది తన జనసైనికులు, వీర మహిళల భద్రత కోసం తాను తీసుకున్న నిర్ణయమని పవన్ చెప్పుకొచ్చారు.  ఈ నిర్ణయంతో జనసైనికులు, అభిమానులే కాకుండా..రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =