నేడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి – నివాళులర్పించిన కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి, ఆర్కే రోజా

AP Union and State Ministers Kishan Reddy and Roja Pays Tribute To Alluri on His Death Anniversary, Kishan Reddy and Roja Pays Tribute To Alluri on His Death Anniversary, AP Union and State Ministers Kishan Reddy and Roja Pays Tribute To Alluri, AP Union Minister Kishan Reddy Pays Tribute To Alluri on His Death Anniversary, AP State Minister Roja Pays Tribute To Alluri on His Death Anniversary, Alluri on His Death Anniversary, AP Union Minister Kishan Reddy, AP State Minister Roja, death anniversary of Alluri Sitarama Raju, Alluri Sitarama Raju, Alluri Sitarama Raju Death Anniversary, AP State Minister Roja participated in a program conducted by Kshatriya Samajam in Visakhapatnam, Kshatriya Samajam, Alluri Sitarama Raju Jayanthi Celebration, Alluri Sitarama Raju Jayanthi Celebration Latest News, Alluri Sitarama Raju Jayanthi Celebration Latest Updates, Alluri Sitarama Raju Jayanthi Celebration Live Updates, Mango News, Mango News Telugu,

ఈ రోజు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి సందర్భంగా.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరియు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్‌ లోని అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, మేయర్ వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా విశాఖకు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నామని, అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. అల్లూరి సీతారామ రాజు 27 ఏళ్ళకే అమరుడైనా.. ఆయన 27తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. అల్లూరి సీతారామ రాజు ఆశయాలకు మరణం లేదని, ఆయన దేశానికీ చేసిన సేవలను, త్యాగాన్ని దృష్టిలో పెట్టుకుని ‘అల్లూరి’ పేరుతో జిల్లా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆయన ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో మన్యం ప్రజల హక్కులు, విద్య కోసం సీఎం జగన్ సారధ్యంలో సాకారం చేస్తున్నామని అన్నారు. అల్లూరి సీతారామ రాజు పేరుతొ ఏర్పాటు చేయనున్న మ్యూజియం కోసం రాష్ట్ర ప్రభుత్వం 22 ఎకరాల స్థలం కేటాయించిందని మంత్రి రోజా తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =