వైసీపీలో చేరిన గోకరాజు గంగరాజు సోదరులు

AP Breaking News, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, Ex BJP MP Gokaraju Gangaraju, EX MP Gokaraju Gangaraju, Gokaraju Gangaraju Joins YCP, Mango News Telugu, YSR Congress Party

బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు డిసెంబర్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు సోదరులు గోకరాజు రామరాజు, గోకరాజు వెంకట నరసింహారాజు, మనుమడు ఆదిత్య వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఈ నేపథ్యంలో జగన్ నాయకత్వాన్ని బలపరిచేందుకే వైసీపీలో చేరుతున్నట్టు గోకరాజు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ చేరిక కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు, నిడదవోలు ఎమ్మెల్యే జీఎస్‌ నాయుడు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eighteen =