కలికిరికి వచ్చిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్​ రెడ్డి.. త్వరలోనే అందరినీ కలుస్తానని ప్రకటన

Ex-CM Nallari Kiran Kumar Reddy Interesting Comments at Kalikiri I will Meet Everyone Soon, Ex-CM Nallari Kiran Kumar Reddy Interesting Comments at Kalikiri, Former CM Nallari Kiran Kumar Reddy Interesting Comments at Kalikiri, Ex-CM Nallari Kiran Kumar Reddy Says I will Meet Everyone Soon, I will Meet Everyone Soon, Interesting Comments at Kalikiri, Nallari Kiran Kumar Reddy Interesting Comments at Kalikiri, Nallari Kiran Kumar Reddy Comments at Kalikiri, Nallari Kiran Kumar Reddy Sensational Comments at Kalikiri, Former CM Nallari Kiran Kumar Reddy, Ex-CM Nallari Kiran Kumar Reddy, Nallari Kiran Kumar Reddy, Kiran Kumar Reddy, Nallari Kiran Kumar Reddy Interesting Comments News, Nallari Kiran Kumar Reddy Interesting Comments Latest News, Nallari Kiran Kumar Reddy Interesting Comments Latest Updates, Nallari Kiran Kumar Reddy Interesting Comments Live Updates, Mango News, Mango News Telugu,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం చిత్తూరు జిల్లా కలికిరి వచ్చిన ఆయనను పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. వారందరినీ పేరుపేరునా పిలుస్తూ, యోగక్షేమాలు తెలుసుకున్నారు. తనతోపాటు వచ్చిన కుమారుడు నిఖిలేష్ కుమార్ రెడ్డిని వారికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన వద్దకు వచ్చిన పీలేరు నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేకంగా మాట్లాడారు. త్వరలోనే మళ్లీ ఇక్కడకు వస్తానని, అందరినీ కలుస్తానని ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మరోసారి వస్తానని, అప్పుడు అందరం కూర్చుని మాట్లాడుకుందామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

తొలుత బుధవారం హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కలికిరి లోని రహదారులు, భవనాల శాఖ అతిధి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర పీసీసీ కార్యదర్శి కేఎస్‌ అఘామోహిద్దీన్‌, జిల్లా కాంగ్రెస్‌ మాజీ కార్యదర్శి డాక్టర్‌ శ్రీవర్ధన్‌ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తన స్వగ్రామం నగిరిపల్లెలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ పనుల నిమిత్తం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి వచ్చినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులపై దృష్టి సారించించిన కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డికి గత కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి నల్లారి సేవలను ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here