తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం కేసీఆర్

bathukamma 2020, Bathukamma festival, Bathukamma Festival 2020, Bathukamma Festival Wishes, Bathukamma Starting Day, CM KCR Bathukamma Festival Wishes, CM KCR Extends Bathukamma Festival Wishes, engili puvvula bathukamma, KCR Bathukamma Festival Wishes, Telangana Bathukamma Festival

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు తొమ్మిది రోజుల పాటుగా ఈ సంవత్సరపు బతుకమ్మ ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించారు. శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని, ప్రతీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లి విరిసేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు. కరోనా పరిస్థితుల్లో నిబంధనలు పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =