తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. జాతీయ జెండా ఆవిష్కరణ

CM KCR Hoisted The National Flag on Telangana Formation Day Celebrations at Public Gardens Hyderabad, Telangana CM KCR Hoisted The National Flag on Telangana Formation Day Celebrations at Public Gardens Hyderabad, KCR Hoisted The National Flag on Telangana Formation Day Celebrations at Public Gardens Hyderabad, Telangana Formation Day Celebrations at Public Gardens Hyderabad, KCR Hoisted The National Flag on Telangana Formation Day Celebrations, Telangana CM KCR Hoisted The National Flag on Telangana Formation Day Celebrations, CM KCR Hoisted The National Flag on Telangana Formation Day Celebrations, Public Gardens Hyderabad, Hyderabad, Public Gardens, National Flag, Telangana Formation Day Celebrations News, Telangana Formation Day Celebrations Latest News, Telangana Formation Day Celebrations Latest Updates, Telangana Formation Day Celebrations Live Updates, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తరువాత హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్‌లో గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీనికి ముందు ఆయన గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను కేవలం 8 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వనరులను అభివృద్ధి చేసుకున్నామని.. దీనికి మనం అందుకున్న జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలే సాధించిన అభివృద్ధికి నిదర్శమని తెలిపారు. తలసరి ఆదాయంలో రికార్డు సాధించామని, మౌలిక వసతుల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. విద్యుత్‌ సరఫరాలో కూడా తెలంగాణ ప్రధమ స్థానంలో ఉంది. దశాబ్దాలుగా వేధిస్తున్న నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్యను అధిగమించాం. ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు ‘మిషన్‌ భగీరథ’ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ముఖ్యంగా ఐటీ, పారిశ్రామిక రంగాలలో దేశంలో అందరికన్నా తెలంగాణ రాష్ట్రమే ముందుంది.

త్రాగు నీరు, సాగు నీరు కోసం ఏకంగా పెద్ద పెద్ద ప్రోజెక్టులనే నిర్మించుకున్నామని, తద్వారా భావి తరాలకు కూడా నీటికి కరువు లేకుండా చేసుకున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైతుల సంక్షేమ కోసం ఎన్నో సంస్కరణలు, పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, సకాలంలో ఎరువులు అందజేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించామని, ఇతర రాష్ట్రాలు మన పథకాలను ఆదర్భంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. 50 వేల కోట్లను రైతులకు పెట్టుబడులుగా అందజేసినట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =