రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అంశంలో గవర్నర్‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

Chandrababu Naidu Responds over Governor Orders on SEC Issue

హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎస్‌ఈసీ అంశంలో గవర్నర్ ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. తద్వారా భారత రాజ్యాంగం గౌరవాన్ని, కోర్టుల ఔన్నత్యాన్ని నిలబెట్టడం సంతోషదాయకం. ఈ చర్యలతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పడిందని” అన్నారు.

“ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో చెలరేగిన హింసా విధ్వంసాలు, అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రానికి అప్ర‌తిష్ట‌ వాటిల్లింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య 4 మూల స్థంభాల (లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా) మనుగడ ప్రశ్నార్ధకమైంది. కరోనాలో ఎన్నికలు ప్రజారోగ్యానికే పెనుముప్పు అనే సదుద్దేశంతో, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసి తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే. న్యాయస్థానాల జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వ పెడధోరణులకు అడ్డుకట్ట పడటం ముదావహం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. ఎస్ఈసి తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షిక విధి నిర్వహణకు దోహద పడాలి. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని కాపాడాలని” చంద్రబాబు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =