రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి, వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్

Andhra Pradesh CM YS Jaganmohan Reddy, AP CM YS Jagan Jagananna Pacha Toranam, CM Jagan to take part in Vana Mahotsavam at AIIMS, CM Y S Jagan Mohan Reddy to launch plantation programme, CM YS Jagan Participated in Vanamahotsavam Programme, CM YS Jagan Participated in Vanamahotsavam Programme and Planted Saplings, CM YS Jagan Planting Saplings In 71st Vanamahotsavam, Jagananna Pacha Toranam, Mango News, Vanamahotsavam, Vanamahotsavam Programme, YS Jagan Participated in Vanamahotsavam Programme, YS Jagan Participated in Vanamahotsavam Programme and Planted Saplings

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ముందుగా గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ రావి, వేప మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటుగా పలువురు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చెట్లు అవసరాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలన్నారు. చెట్ల పెంపకం వలన ఆక్సిజన్ లెవెల్స్ లో స్వచ్ఛత, వర్షాలు ఎక్కువపడడం జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి:

చెట్ల పెంపకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం మాత్రమే ఉన్న ఫారెస్ట్ కవర్ ను 33 శాతానికి తీసుకెళ్లే దిశగా మనమంతా గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం, పెంచడం, కాపాడంపై సీఎం వైఎస్ జగన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటేందుకు అటవీ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 3 =