కాంగ్రెస్‌ సీనియర్లు రంగంలోకి దిగుతారా..?

Congress Seniors Will Enter The Field..?, Congress Seniors, Congress Seniors In Field, AP, Telangana, TDP, Janasena, BJP, Congress, YCP, Competition, Congress Seniors, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP, Telangana, TDP, Janasena, BJP, Congress,YCP, competition, Congress seniors

అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలను కూడా వైఎస్‌ షర్మిల  చీల్చి చెండాడుతున్నారు. ముఖ్యంగా అధికార పక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడైనా సరే..ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్రానికి ఏమి చేశావన్నా అంటూ నిలదీస్తోంది. మొదటి నుంచీ కాంగ్రెస్‌ను అంటి పెట్టుకొని ఉన్న సీనియర్‌ నాయకులకు షర్మిల అటాకింగ్‌కు ముచ్చటపడిపోతున్నారట.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆర్థికంగా బలమున్న నాయకులంతా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో  రంగంలోకి దిగడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ల కోసం దాదాపు 1500 మంది వరకు దరఖాస్తులు చేసుకోగా వీరిలో సీనియర్‌ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు.  అయితే ఈ సీనియర్లకు సీట్లు దక్కుతాయా? ఆర్థికంగా బలమున్న వారిని పార్టీ ఎంపిక చేస్తుందా? అనేది ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మాజీ మంత్రి జేడీ శీలం, రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్,  మాజీ రాష్ట్ర మంత్రి, రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి మొదటి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, లగడపాటి రాజగోపాల్, గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు, డాక్టర్‌ తులసి రెడ్డి,  జంగా గౌతమ్, దుట్టా రామచంద్రరావు వంటి నేతలు.. పార్లమెంటు స్థానాల్లో కానీ అసెంబ్లీ స్థానాల్లో కానీ బరిలోకి దిగితే కాంగ్రెస్‌ బలం మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అవసరమైతే  ఈ సీనియర్లకు కాంగ్రెస్‌ పార్టీనే ఆర్థిక భారాన్ని  మోయాల్సి రావచ్చని…ఏపీలో పూర్తిగా  చచ్చిపోయిన కాంగ్రెస్‌ను బతికించుకోవాలంటే ఇంత కంటే వేరే మార్గం ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది.  శనివారం    ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశాక.. ఈనెల 17న కానీ, 18 న కానీ  కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించుకుంది.

దీనికోసం  మూడు రోజుల క్రితం  ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఏఐసీసీ.. ఏపీ  కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది.దీనికంటే ముందు వారం రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం.. ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేసారు. ఈ తర్వాత వీరిలో  కొంత స్క్రీనింగ్‌ జరిపి.. మెరుగైన అభ్యర్థులను కేంద్ర నాయకుల ముందు ఏపీసీసీ ఉంచడంతో వారిలో ఎంత మందికి టికెట్లు ఇవ్వాలనేదానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + five =