నెల్లూరు జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు, జిందాల్‌ స్టీల్‌ కంపెనీకి భూములు కేటాయింపు

860 acres allotted to JSPL for setting up integrated steel plant, Andhra allots 860 acres to Jindal Steel, Andhra Government Allots Land For Op Jindal, Andhra govt allots 860 acres of land in Nellore to Jindal Steel, Andhra Pradesh allots 860 acres land in Nellore, AP Govt Allocated 860 Acre Land to Jindal Steel Andhra Ltd, AP Govt Allocated 860 Acre Land to Jindal Steel Andhra Ltd to Establishment of Steel Plant at Nellore, Jindal Steel Andhra Ltd, Jindal Steel to set up steel plant in Nellore district, Mango News, Steel Plant at Nellore

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలోని చిలుకూరు మండలం తమ్మినపట్నం-మోమిడి గ్రామాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌ కంపెనీకి 860 ఎకరాల భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల కేటాయింపుపై గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.7,500 కోట్లతో 2.25 ఎంటీపీఏ సామర్థ్యంతో జిందాల్‌ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టీల్‌ప్లాంట్‌తో 2,500 మందికి ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇందుకు సంబంధించిన అన్ని అవసరమైన చర్యలు తీసుకుని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ప్రభుత్వానికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + seven =