ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC has Rescheduled Written Examination for the Post of Horticulture Officer to June 17th From April 4th,TSPSC has Rescheduled Written Examination,Post of Horticulture Officer,Horticulture Officer to June 17th From April 4th Rescheduled,TSPSC,Mango News,Mango News Telugu,TSPSC reschedules another exam,TSPSC reschedules Horticulture Officer exam,TSPSC postpones Horticulture Officers exam,Horticulture Testnow On June 17,TSPSC Exam Postpone,TSPSC Latest News and Updates

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మరో నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్షను జూన్‌ 17కు వాయిదా వేస్తునట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ముందుగా 2022, డిసెంబర్ 22న ఉద్యానవన శాఖ డైరెక్టర్ నియంత్రణలోని 22 హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ నెం.24/2022ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ క్రమంలో హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 4న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు.

అయితే తాజాగా హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పరీక్షను జూన్ 17వ తేదికి రీషెడ్యూల్ చేసినట్టు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 17న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here