మంత్రి చెల్లుబోయినకు టఫ్ టాస్క్

Tough Task For Minister Chelluboinaku, Tough Task For Minister, Chelluboinaku Tough Task, Minister Chelluboinaku Tough Task, Minister Chelluboin Venugopal, Rajamundry Rural, AP Politics, YCP, Latest Chelluboinaku Political News, Chelluboinaku Political News, Andra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Minister chelluboin venugopal, Rajamundry Rural, AP Politics, YCP

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 50కి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు. అతి త్వరలోనే మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఈసారి పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం, జనసేన పార్టీలు గెలుపు లక్ష్యంగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఎక్కువగా గోదావరి జిల్లాల్లోని కీలక స్థానాల నుంచి జనసేన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అటు తెలుగు దేశం పార్టీ కంచుకోట అయిన రాజమండ్రి రూరల్ నుంచి కూడా ఈసారి జనసేన పోటీ చేయనుందట. వాస్తవానికి రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ తరుపున బుచ్చయ్య గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలను వైసీపీ దక్కించుకున్నప్పటికీ.. రాజమండ్రి రూరల్‌ను మాత్రం టచ్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారట. రాజమండ్రి రూరల్ జనసేనకు ఇచ్చేందుకు ముందు చంద్రబాబు నాయుడు అంగీకరించకపోయినప్పటికీ.. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీకి కంచుకోట అయిన రాజమండ్రి రూరల్ టికెట్ ఇప్పుడు వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఆ సమయంలోనే రాజమండ్రి రూరల్ టికెట్‌ను చెల్లుబోయినకు కేటాయించారు. అయితే మంత్రి చెల్లుబోయినకు జగన్ బిగ్ టాస్క్ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. అటు రాజమండ్రి రూరల్‌లో టీడీపీ, జనసేన జెండా ఎగరడం ఖాయమని బలమైన సంకేతాలు వెలవడుతున్నాయి. అటు సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఈక్రమంలో మంత్రి చెల్లుబోయిన కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి ఎట్టి పరిస్థితిలోనైనా గెలుపొందాలని ఇప్పటి నుంచే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. మరి వేణుగోపాల్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి?.. టీడీపీ కంచుకోటను వేణుగోపాల్ బీటలు వారిస్తారా..? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =