భారీ వర్షాలతో ఏపీలో ఆ రెండు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు

Chittoor, Nellore Collectors Announced Holiday for Educational Institutes today Due to Heavy Rains

ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వరదనీటితో పలు చోట్ల కాలువలు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం కారణంగా ప్రజాజీవనానికి ఆటంకం ఏర్పడింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు గురువారంతో పాటుగా శుక్రవారం కూడా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు చిత్తూరు జిల్లా కూడా భారీ వర్షాలతో వణికిపోతోంది. పెనుగాలులతో పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా, వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా నవంబర్ 12, శుక్రవారం నాడు చిత్తూరు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు శుక్రవారం సెలవు ఉంటుందని చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − two =