ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్‌ టాపర్లకు గుడ్ న్యూస్.. నగదు ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్

CM Jagan Announces Cash Incentives For SSC Toppers of Government Schools Students in AP,CM Jagan Announces Cash Incentives For SSC Toppers,SSC Toppers of Government Schools Students in AP,Incentives For SSC Toppers in AP,Government Schools Students in AP,CM Jagan Announces Cash Incentives,Mango News,Mango News Telugu,AP Govt To Felicitate Toppers In SSC,CM Jagan Latest News,CM Jagan Latest Updates,AP CM YS Jagan Mohan Reddy,AP CM Jagan Latest News and Live Updates,AP SSC Toppers Incentives Latest News

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని 10వ తరగతిలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతి అందించనున్నారు జగన్. ఈ మేరకు సదరు విద్యార్థులకు అవార్డులు, నగదు ప్రోత్సాహకాలను అందించి సత్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం.. టాపర్‎గా మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15వేలు, రెండో స్థానం దక్కించుకున్న వారికి రూ.10 వేలు, మూడో స్థానం పొందిన వారికి విద్యార్థికి రూ.5 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. త్వరలోనే ఈ నగదును ఆయా విద్యార్థులకు అందించనున్నారు. ఇక ఈ నగదు ప్రోత్సాహకాలు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోనూ తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఇవ్వనున్నారు. జిల్లా పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్‌, ట్రైబల్ వెల్ఫేర్, ఆశ్రమ పాఠశాలలకు, కేజీబీవీ స్కూల్స్‌లో చదివి టాపర్లుగా నిలిచిన విద్యార్ధులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =