ఏపీలో అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. పంట నష్టం, తడిసిన ధాన్యం కొనుగోలుపై కీలక ఆదేశాలు

CM Jagan Directs Officials To Assess Crop Damage Buy Wet Paddy For Helping Farmers who Suffered with Untimely Rains,CM Jagan Directs Officials To Assess Crop Damage,Buy Wet Paddy For Helping Farmers,Farmers who Suffered with Untimely Rains,Mango News,Mango News Telugu,Andhra CM directs officials to help farmers,Take steps to help farmers suffering losses,AP to start enumeration of damage,AP CM YS Jagan Mohan Reddy,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ మేరకు ఆయన వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ సమీక్షా సమావేశంలో సీఎంఓ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టంపై ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని సమీక్షించిన సీఎం జగన్, దెబ్బతిన్న పంటలను గుర్తించాలని, ఎంతమేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతుల నుండి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, ఇన్‌పుట్‌ ​​సబ్సిడీ ద్వారా రైతులను ఆదుకునేందుకు దెబ్బతిన్న పంటలపై వెంటనే నివేదిక రూపొందించాలని, పంట నష్టపోయిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం గ్రామ సచివాలయాల వద్ద ప్రదర్శించాలని అధికారులను కోరారు. ఇంకా పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ ​​సబ్సిడీతో పాటు బీమాకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించి పంటల బీమా త్వరగా అందేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు, మార్చి నెలకు సంబంధించి పంట నష్టం గణనను పూర్తి చేశామని, ప్రస్తుతం ఏప్రిల్‌లో జరిగిన పంట నష్టాల లెక్కింపులో నిమగ్నమై ఉన్నామని ముఖ్యమంత్రికి వివరించారు. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లోని కలెక్టర్లు త్వరగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని, మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =