తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

Telangana Govt Enhanced DA to Govt Employees DR to Pensioners by 2.73 Percent with Effect From July 2021,Telangana Govt Enhanced DA,Govt Employees DR,Pensioners by 2.73 Percent,Effect From July 2021,Mango News,Mango News Telugu,Telangana Employees Da Latest News,D.A For Telangana Employees,Da Rates Telangana State Govt Employees,Da Table Telangana,New Da For Telangana Pensioners,New Da Table Telangana 2022,Present Da For Telangana State Govt Employees,Telangana Employee Pay Details,Telangana Government Employees List,Telangana Govt Employees Data,Telangana Govt Employees Phone Numbers,Telangana Govt Employees Retirement Age,Telangana Movement Important Dates,Telangana State Govt Employees Da,Ts Da Go,Ts Da Table 2021

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) మరియు పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి అనగా 2.73 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 2021, జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రకటించారు. 2021 జులై నుంచి 2022 డిసెంబ‌ర్ నెల‌ఖారు వ‌ర‌కు బ‌కాయిలు చెల్లించ‌నున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నిర్ణయంపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (డీఏ/డీఆర్) 2.73% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 17.29 శాతాన్ని, 20.02 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ పెంపు గతేడాది జూలై 1వ తేదీ నుండి వర్తిస్తుంది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here