ఈ నెల 21 నుంచి మలిదశ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

Janasena Chief Pawan Kalyan Appeals Cadre to Make Active Membership Registration Program Success, Janasena Chief Pawan Kalyan Appeals Cadre, Pawan Kalyan Appeals Cadre to Make Active Membership Registration Program Success, Active Membership Registration Program Success, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan, Actor Pawan Kalyan, Hero Pawan Kalyan, Janasena Party, Janasena Party Latest News, Janasena Party Latest Updates, Janasena Chief Appeals Cadre to Make Active Membership Registration Program Success, Pawan Kalyan Appeals Cadre to Make Active Membership Registration Program, Janasena Chief Pawan Kalyan Appeals Cadre to Make Active Membership Registration Program, Pawan Kalyan Appeals Cadre, Mango News, Mango News Telugu,

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ మలిదశ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. “2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాదాపు లక్ష మందికి పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో గమనించాను. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం నా దృష్టి వచ్చింది. అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైనవారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సహాయం అందించారు. ఇవన్ని చూసి తన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రీమియం కోసం రూ.కోటి నిధిని అందచేశాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

“ఈ కార్యక్రమాన్ని జన సైనికులు పెద్ద ఉద్యమంలా చేపట్టారు. లక్షమందికిపైగా సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేశారు. ఇప్పటి వరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులు అందించారు. ఈ కార్యక్రమాన్ని మన కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని చేపట్టింది. దీనిని ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళలు ముందుండి నడిపించాలని, ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేయాలని కోరుకుంటున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 6 =